అందం కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నఆలియా భట్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వ‌రుస‌ సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇటీవ‌ల త‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. మహేష్ భ‌ట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరస బాలీవుడ్ సినిమాలో నటించిన ఆలియా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెర్కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇటీవల హాలీవుడ్ మూవీలో తన యాక్షన్ తో మెప్పించిన ఆలియా.. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే మరో పక్కన ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఆలియా భట్ ర‌ణ్‌బీర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే అలియాభ‌ట్ పర్సనల్ లైఫ్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా అలియా భట్ అందంగా మారడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందంటూ.. రణ్‌బీర్‌ ఆలియాను సరిగ్గా చూసుకోవడం లేదంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక ఇటీవల కాఫీ విత్ కారణ్‌ షోకి హాజరైన అలియా.. వీటిపై క్లారిటీ ఇచ్చింది. అలియా మాట్లాడుతూ ఇప్పుడు అంత సోషల్ మీడియానే. అందులో రోజుకో రూమర్, నేను సన్నగా మారడానికి, తెల్లగా అవడానికి సర్జరీలు చేయించుకున్నాన‌ని రూమర్స్ రాశారు. నా మ్యారేజ్ లైఫ్ మీద కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. రణ్‌బీర్ నన్ను వేధిస్తున్నాడంటూ కామెంట్ చేశారు. ఇలాంటి విషయాల మీద జనాలు ఆశ‌క్తి చూప‌డం భాద‌గా ఉంది. కానీ ఈ న్యూస్ లతో ఏమాత్రం నిజం ఉండదు. అవన్నీ రూమర్స్.. అందుకే నేను ఈ వార్తలను ఎప్పుడు పట్టించుకోను అంటూ వివరించింది.