సూపర్ స్టార్ కోసం రంగంలోకి పవర్ స్టార్.. ఏ మూవీలో అంటే..?!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. ఎప్పుడు చూడని విధంగా మహేష్ బాబు లుక్స్ ఈ సినిమాలో కనిపించడంతో ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఎస్.థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

విలన్ రోల్ లో జగపతి బాబు నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం గుంటూరు కారం సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ కోసం పవర్ స్టార్ తన వాయిస్ మేకోవ‌ర్‌ అందించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ వ‌ర్గాల నుంచి అందుతున స‌మాచారం ప్రకారం నిజంగానే సూపర్ స్టార్ కోసం పవర్ స్టార్ తన వాయిస్ ని అందించాడట.

మహేష్ బాబు ఎంట్రీతోపాటు మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు పవర్ స్టార్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇక జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో లాంచ్ కాబోతుంది. సినిమా రిలీజ్ అయితే గాని ఇందులో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడా అనే అంశంపై క్లారిటీ రాదు.