శ్రీ లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక..!!

ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక తెలుగు తమిళ భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నది.. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి మెప్పించింది.. వివాహం తర్వాత కూడా హన్సిక ఇండస్ట్రీకి దూరంగా ఉండకుండా పలు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న హన్సిక ఇటీవల తాను నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అలా ఇంటర్వ్యూలో పాల్గొన్నా హన్సిక తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మీకు ఎవరు ఇష్టమనే ప్రశ్న వేయగా ఈ ప్రశ్నకు హన్సిక ఏమాత్రం ఆలోచించకుండా శ్రీ లీల అంటూ సమాధానాన్ని తెలియజేయడం జరిగింది. శ్రీ లీల చూడడానికి చాలా అందంగా ఉంటుంది.. అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ ఉంటుంది.. తన డాన్స్ తో బాగా అందరిని ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్ చేయడం జరిగింది హన్సిక.

ప్రస్తుతం ఉన్నటువంటి నటి మనులను చూస్తూ ఉంటే తనకు ఎలా అనిపిస్తుంది అనే విషయం పైన మాట్లాడుతూ ఈ ప్రశ్న కూడా ఈమె ఆసక్తికరమైన సమాధానాన్ని తెలిపింది.. నటన విషయంలో ప్రస్తుతం ఓల్డ్ యంగ్ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు చూస్తున్నారని వయసు గురించి కాకపోయినా అనుభవం విషయంలో ఎవరికి వారికి ఉంటుందని తెలియజేయడం జరిగింది.. 8 ఏళ్ల వయసులో తాను ఒక పని చేసేదాన్ని 15 ఏళ్ళు వచ్చాక హీరోయిన్గా మారాను కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయిందని ప్రస్తుతం హీరోయిన్స్ ఏదైనా నేర్చుకొని సైతం ఎలాంటి సన్నివేశాలలో నటించడానికి అయినా సిద్ధంగానే ఉన్నారని తెలుపుతోంది హన్సిక.