ఇప్పటివరకు నేను ఏ సినిమాలో అలాంటి సీన్స్ నటించలేదు: వరలక్ష్మి శరత్ కుమార్

టాలీవుడ్ స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటించిన మూవీ కోటబొమ్మాలి పిఎస్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌రోల్‌ నటించిన ఈ మూవీలో శ్రీ‌కాంత్, వరలక్ష్మి కీలక పాత్రలను పోషించారు. అర్జున పాల్గొన మూవీ ఫ్రేమ్ తేజ మాని రూపొందించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది వరలక్ష్మి.

ఆమె మాట్లాడుతూ నా సినీ కెరీర్ లో ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయని.. తమిళంలో ఇప్పటికే నేను చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ నటించానని.. తెలుగు ఆడియోన్స్ కి మాత్రం ఫస్ట్ టైం పోలీస్‌గా కనిపించబోతున్నానని వివరించింది. ఇన్వెస్టిగేటివ్ త్రిల్లర్ ట్రెండ్‌ నడుస్తున్న ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించాలి అంటూ వివరించింది. ఈ మూవీలో నేను కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్న. నేను స్టోరీ నే హీరోగా భావిస్తా ఇందులో శ్రీకాంత్ గారు ఓ పోలీస్ ఆఫీసర్.. నేను ఓ పోలీస్ ఆఫీసర్.. అయితే వీరిద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది.. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది అనేదే మూవీ కాన్సెప్ట్. అంటూ వివరించింది.

ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని.. ఎలక్షన్ టైం లో రావడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అంటూ వివరించింది. ఓటుపై అవగాహన కలిగించే పాయింట్ కూడా ఈ సినిమాలో ఉందట. వరలక్ష్మి ఈ సినిమాలో నాకు స్మోకింగ్ చేయడం చాలా చాలెంజింగ్‌గా అనిపించిందని ఇప్పటివరకు నేను ఏ సినిమాలో అలాంటి సన్నివేశంలో నటించలేదంటూ వివరించింది. అందుకే ఈ సీన్ ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ క్యారెక్టర్‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేశాను. యాక్షన్ కంటే మైండ్ గేమ్ సినిమాలో ఎక్కువగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక పోలీస్ సిస్టం, పొలిటికల్ సిస్టం గురించి చూపించామని కానీ ఏ పార్టీకి ఈ సినిమాకు సంబంధం లేదని వివరించింది. ఇక సినిమాలో లింగిడి లింగిడి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉందని వివరించింది. మంచి క్యారెక్టర్ చేయాలని ఎప్పుడూ నేను భావిస్తా, సినిమాలో వరలక్ష్మి యాక్టింగ్ చాలా బాగుంది అనుకోవాలని.. సినిమాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి మూవీలో అయినా నేను నటించడానికి రెడీ అంటూ వివరించింది.