ఒకే సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఇటీవల కాలంలో ఓ హీరోనుంచి ఏడాదికి ఒక సినిమా రావడమే గ్రేట్‌. అలాంటిది స్టార్ హీరోలు సినిమాలంటే ఖచ్చితంగా ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు ఒక సినిమా కోసమే సరిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక్క స్టార్ హీరో ఏడాదిలో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారంటే గగనమే. కానీ గ‌తంలో ఓ స్టార్ హీరో ఏకంగా ఏడాదిలోనే 18 సినిమాలను రిలీజ్ చేసి రికార్డును క్రియేట్ చేశాడు. ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా..? సూపర్ స్టార్ కృష్ణ.

1972వ సంవత్సరంలో ఆయన ఏకంగా 18 సినిమాలను రిలీజ్ చేసి అ సంవ‌త్స‌రంలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఆ రికార్డును ఇప్పటివరకు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఒక సంవత్సరంలో 18 సినిమాలంటే దాదాపు 20 రోజులకు ఒక సినిమాని రిలీజ్ చేసినట్లు. అనీ సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి మన హీరోలు డైరెక్టర్లు నాన్న తంటాలు పడుతున్నారు.

 

ప్ర‌స్తుత హీరోలు మొత్తం కెరీర్‌లోనే చేసే సినిమాలు ఒక్క సంవత్సరంలోనే కృష్ణ గారు చేసి చూపించాడు. ఆయన సినీ కెరీర్‌లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడు షిఫ్ట్ లు చేసి మరి సినిమాలను పూర్తి చేసేవాడట.ఆయన చేసే ప్రతి సినిమాపై ఆయన ఎంతో శ్రద్ధ చూపి నటించేవారట. అందుకే ఆయన 350 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక కృష్ణ తీసిన చాలా సినిమాలు దాదాపు సక్సెస్ అందుకున్నాయి.