టాలీవుడ్లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి క్రేజీ సంపాదించుకున్న వర్మ ఇటీవల కాలంలో ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వర్మ. సినిమాల పైన పొలిటికల్ పైన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు.
గత కొంతకాలంగా వర్మ సినిమాలు చేయడం మానేసి వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేయడం మొదలుపెట్టారు. జగన్ కు మద్దతుగా వైసీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ సినిమాలు చేయడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శలు చేసిన వారికి గట్టి కౌంటర్లు వేస్తూ ఉంటారు వర్మ.. తాజాగా నిన్నటి రోజున అవనిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల పైన వర్మ స్పందించడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలు నీవు కేవలం ఒక బంటువు మాత్రమే పవన్ కళ్యాణ్ అని ఆయన ఎద్దేవా చేయడం జరిగింది..రాజు దాకా అవసరం లేదు ఏనుగులు గుర్రాలతోనే నిన్ను తొక్కించేస్తాడు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ వాక్యాల పైన పలువురు టిడిపి శ్రేణులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేతలు జనసేన కార్యకర్తలు కూడా వీటికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ టిడిపికి సపోర్టు చేయడం అటు జనసేన కార్యకర్తలకు టిడిపి కార్యకర్తలకు నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో కేవలం నువ్వో బంటువి పవన్ కళ్యాణ్,రాజు దాకా అవసరం లేదు ఏనుగులు గుర్రాలతో తొక్కించేస్తాడు నిన్ను…@PawanKalyan pic.twitter.com/0eZKKou9EL
— Ram Gopal Varma (@RGVzooi) October 1, 2023