ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతున్న `లియో`.. అక్క‌డ విజ‌య్‌ బీభ‌త్సం మామూలుగా లేదు!

విడుద‌ల‌కు ముందే ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతోంది. విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వ‌స్తున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాలో చెన్నై సుంద‌రి త్రిష హీరోయిన్ గా న‌టించింది. అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. అక్టోబ‌ర్ 19న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దానికి విజ‌య్ మ్యానియా తోడ‌వ‌టంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో దూసుకుపోతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ దగ్గర లియో టికెట్ల అమ్మకాలు ఏకంగా మిలియన్ డాలర్ల మార్క్ దాటడం విశేషం.

గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ కూడా విడుద‌ల‌కు ముందే మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ సినిమాగా లియో రికార్డు సృష్టించింది. మ‌రోవైపు యూకేలోనూ ప్రీ బుక్కింగ్ సేల్స్ లో దుమ్ము దుమారం లేపుతోంది. మొత్తంగా ఇటు ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ లియో మూవీ తొలి రోజే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.