మాస్ మహారాజా రవితేజ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నాడో..ఇప్పటివరకు అదే విధంగా కొనసాగుతూ తనలోని మాస్ లెవెల్స్ ని ఏమాత్రం డౌన్ కాకుండా చూసుకుంటున్నాడు. కాగా రవితేజ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది విక్రమార్కుడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేసింది . అప్పటి నుంచి వీళ్ళ కాంబోలో రెండో సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకున్నారు . అయితే ఆ ముచ్చట అభిమానులకు తీరిపోతుంది . రీసెంట్గా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది . రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో రవితేజ విలన్ పాత్ర పోషించబోతున్నాడట .
మహేష్ బాబు హీరోగా నటించబోయే ఈ సినిమాలో రవితేజ భయంకరమైన కృయాలిటీ ఉన్న ఓ విలన్ పాత్రను పోషించబోతున్నారట. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న రవితేజ ఇలా విలన్ రోల్ చేయడం పై ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ గతంలో విక్రమార్కుడు సినిమా ఇచ్చిన హిట్ కోసం ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి రాజమౌళి రవితేజ కాంబోలో సినిమా అంటే కేక అరుపులు పెట్టించాల్సిందే..!!
రాజమౌళి కోసం రవితేజ బిగ్ శాక్రిఫైజ్.. రుణం ఇలా తీర్చుకుంటున్నావా బ్రో..?
