రతిక మళ్లీ బిగ్ బాస్ లోకి వెళ్లడానికి కారణం ఆ హీరోనా..? ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయే న్యూస్ ఇది..!!

రతిక..  నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకు పెద్దగా తెలిసేది కాదు . బిగ్ బాస్ పుణ్యం అంటూ ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో రతిక పేరు టాటూ కన్నా ఎక్కువగా  ముద్రించుక పోయింది . బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది . ఆమె ఆడే ఆట నచ్చకనో.. ఆట వెనకాల చేసే పనులు నచ్చకో తెలియదు కానీ రతికను ఎలిమినేట్ చేసేసారు జనాలు .

ఓట్లు తక్కువగా వేయించడం ..బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడం ..ఒక్క వారంలోనే జరిగిపోయింది . అయితే హౌస్ నుంచి రతిక వెళ్లిపోవడం పట్ల పలువురు జనాలు పండగ చేసుకున్నారు . కొందరు బాధపడిపోయారు . అయితే ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం రితికను బాగా ప్రమోట్ చేస్తున్నారు.  హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రతిక మళ్ళీ హౌస్ లోకి వెళ్ళాలి అని టాప్ కంటెస్టెంట్ గా ఉండే  సత్తా ఆమెకు ఉంది అంటూ తెగ ప్రమోట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది.  రతిక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది అన్న విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్ వైరల్ అవుతుంది . ఈ పోస్టర్ ని రతిక కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేయడం గమనార్హం. దీంతో ఆ హీరో ఫ్యాన్స్ వల్లే ఆమె  మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు..!!