ఒక్కేసారి రెండు గుడ్ న్యూస్లు ..ఇక ఈ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేం రా సామీ..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు మర్చిపోలేని రోజుఅనే చెప్పాలి . ఒక గుడ్ న్యూస్ ఒక స్టార్ హీరో కి సంబంధించి వింటేనే మనం ఆగలేం. అలాంటిది  ఇద్దరు హీరోలకి సంబంధించిన రెండు గుడ్ న్యూస్ లు  బ్యాక్ టు బ్యాక్ వింటే వామ్మో ..ఇక ఈ ఫ్యాన్స్ ని ఆపలేము.  అది కూడా నందమూరి ఫ్యాన్స్ ని అయితే అస్సలు ఆపలేము. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . ప్రజెంట్ అలాంటి ఓ  హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ .

బాలయ్య నటించిన భగవంత్  కేసరి సినిమా ఈరోజు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . బాలయ్య ఖాతాలో మరో హిట్ పడింది . నందమూరి అభిమానులు  ఆనందపడడానికి ఇది ఒక కారణమైతే.. జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.  ఆస్కార్ తన కొత్త మెంబర్స్ లిస్ట్ ని నేడు ప్రకటించింది .

ఈ లిస్టులో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు . ఈ విషయాన్ని అకాడమీ కమిటీ తెలియజేస్తూ ఒక పోస్ట్ చేసింది . యాక్టర్స్ బ్రాంచ్ మెంబర్గా ఎన్టీఆర్ ని అకాడమీ నియమించుకుంది . ఈ అరుదైన గౌరవం ఎన్టీఆర్ కి లభించడంతో నందమూరి ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఉన్నారు . ఇలా బ్యాక్ టు బ్యాక్ మొదట బాబాయ్ ఆ తర్వాత అబ్బాయి గుడ్ న్యూస్ లు చెప్పడంతో ఫాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు..!!