“గుంటురు కారం” సినిమాలో మహేష్ కి ఆ జబ్బు ఉందా..? కొత్త పొస్టర్ లో ఇచ్చిన క్లూ గమనించారా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తుంది . పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయిపోతున్నారు.  తాము నటించే సినిమాలలో ఆ హీరో పాత్రకు ఏదైనా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటే కచ్చితంగా ఆ హీరో క్యారెక్టర్ ను లైక్ చేస్తున్నారు . సినిమా హిట్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కొందరు డైరెక్టర్ లు  అదే ట్రెండ్ ని కళ్ళు మూసుకొని ఫాలో అయిపోతున్నారు.

రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సైతం అదే పని చేశాడు అంటూ తెలుస్తుంది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.  మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు . తాజాగా దసరా కానుకగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ త్వరలోనే ఫస్ట్ పాటను రిలీజ్ చేయబోతున్నామంటూ చెప్పుకొచ్చారు .

అయితే ఈ పోస్టర్ లో మహేష్ బాబు నోట్లో బీడీ పెట్టుకొని చాలా స్టైలిష్ గా ట్రెండీగా మాస్ లుక్ లో కనిపించారు . అయితే గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో సైతం మహేష్ బాబు బీడీ తాగుతున్నట్లు ఎక్కువగా సీన్స్ మనం చూడొచ్చు . ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఈ సినిమాలో బీడీ ఎక్కువగా తాగే  జబ్బు ఉందని ..అలా ఈరోల్ త్రివిక్రమ్ క్రియేట్ చేశాడు అని తాజా పోస్టర్ ద్వారా కనిపెట్టేశారు అభిమానులు. దీంతో ఇదే న్యూస్  ట్రెండ్ చేస్తున్నారు..!!