`స‌లార్‌`పై కేజీఎఫ్ సెంటిమెంట్.. రిపీటైతే ప్ర‌భాస్ కు బ్లాక్ బ‌స్ట‌రే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న మాస్ యాక్ష‌న్ డ్రామా `స‌లార్‌`. రెండు భాగాలుగా ఈ సినిమాలో రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జగపతి బాబు, టినూ ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే పోయినా వార‌మే స‌లార్ పార్ట్ 1 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చుండేది. కానీ, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా ప‌డింది. స‌లార్ ఈ ఏడాది రావ‌డం క‌ష్ట‌మే అనుకుంటున్న స‌మ‌యంలో.. మేకర్స్ కొత్త రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. క్రిస్మ‌స్ కానుక‌గా సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్ ను డిసెంబ‌ర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క‌ట‌న‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌శాంత్ నీల్ గ‌త చిత్రం కేజీఎఫ్ కూడా రెండు భాగాలుగా వ‌చ్చిన సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. అయితే కేజీఎఫ్ పార్ట్ 1ను కూడా 2018లో క్రిస్మ‌స్ కానుక‌గానే డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు స‌లార్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ సినిమా తొలి భాగాన్ని క్రిస్మ‌స్ కే తీసుకొస్తున్నారు. కేజీఎఫ్ సెంటిమెంట్ స‌లార్ విష‌యంలోనూ రిపీటైతే ప్ర‌భాస్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌వుతుంద‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.