నిలబడి నీటిని తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..?

మానవులకే కాకుండా జంతువులకు కూడా నీరు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. నీరు లేకపోతే ఏ పని కూడా చేయలేము.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు నిద్ర అనేది కచ్చితంగా ఉండాలి లేకపోతే పలు అనారోగ్య సమస్యలు కూడా చేరువవుతాయి. అందుకే వైద్యులు సైతం కనీసం రోజులో రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగమని సూచిస్తూ ఉంటారు. శరీరంలో తగిన నీరు లేకపోతే డీహైడ్రేషన్కు గురై ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట.

15 benefits of drinking water and other water facts

అయితే నీటిని ఎలా పడితే అలా తాగకూడదని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.. సరైన మార్గంలో నీరు తాగకపోవడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇటీవల వైద్యుల సైతం ఒక అధ్యయనంలో తెలియజేశారు. ఈ అధ్యాయనం ప్రకారం నీరు తాగేటప్పుడు పలు సూచనలు సైతం పాటించాలి ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్లో నీటిని తాగకూడదు చాలా మంది ఇలాంటి నీరును తాగడానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బాటిల్ లో నీరు నిల్వ ఉంచే నీటిని తాగకూడదని ఆహార నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

ఇందులోని ప్లాస్టిక్ వ్యర్ధాలు 80% బ్లడ్ తో కలుస్తాయట ఇవి శరీరాన్ని చాలా దెబ్బతినేలా చేస్తాయి. దాహం వేసినప్పుడు నీరు తాగకూడదు.. ప్రతి అరగంటకు ఒకసారి లేదా గంటకు ఒకసారైనా నీటిని తాగాలని తెలియజేస్తున్నారు ఇలా తాగడం వల్ల డిహైడ్రేషన్ కి శరీరం గురికాకుండా ఉంటుంది.

ఒకేసారి ఎక్కువ మోతాదులో నీటిని తాగకూడదు ఇలా చేయడం వల్ల వాపు రెస్ట్లెస్ లాంటి సమస్యలు ఎదురవుతాయి.

ఆహారం తినేటప్పుడు ఎక్కువగా నీటిని తాగకూడదు ఇలా తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు దీంతో జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఫ్రిడ్జ్ లో నీటిని ఎక్కువగా తాగకూడదు ఇలా చేయడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యం తగ్గిపోతుంది.

చాలామంది తెలియక నీళ్లను నిలబడి వేగంగా తాగుతూ ఉంటారు అయితే ఇలా తాగడం వల్ల కడుపుపై ప్రభావం చూపి జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయట.