హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా చేసుకుంటున్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది .గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అనడమే తప్ప ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ తెలపలేదు.. అందుకు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా అవడం అని పలువురు అభిమానులు తెలుపుతున్నారు. అయితే మిగతా సినిమాలకు డేట్లు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి మాత్రం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

రీయంట్రీలో రీమిక్స్ సినిమాల పైన ఎక్కువ మోజు చూపించిన పవన్ కళ్యాణ్ కేవలం డైరెక్టర్ క్రీష్ తో స్ట్రైట్ సినిమాని హరిహర వీరమల్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేసిన పాన్ ఇండియా మొదటి ప్రాజెక్టు ఇదే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. లేటుగా మొదలుపెట్టిన సినిమాలే విడుదలవుతున్న ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇంకా విడుదల కాలేదు అసలు ఈ సినిమా ఉంటుందా లేకపోతే అట్టకెక్కినట్టేనా అంటూ పలువురా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఏ ఫెస్టివల్ కి కూడా సరైన అప్డేట్ ఇవ్వలేదు.