కుర్ర డైరెక్టర్ తో చిరంజీవి మూవీ.. అన్ని వందల కోట్లతో రిస్కేనా..?

హీరోగా చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో Uv క్రియేషన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..UV నిర్మాతలు సాహో, రాధే శ్యామ్ సినిమా తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.ఈ సినిమా బడ్జెట్ మాత్రం హద్దులు దాటుతోంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా సినిమాలకు నష్టాలనే మిగులుస్తున్నాయని ఇలాంటి సమయంలో చిరంజీవికి ఇంత భారీ బడ్జెట్ సినిమా అవసరమా చాలా రిస్క్ తో కూడిన పని అని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ ఏడాది మిస్ శెట్టి.. మిస్టర్ పాలిశెట్టి సినిమాతో UV క్రియేషన్ బ్యానర్ కు మంచి విజయాన్ని అందుకుంది.. డైరెక్టర్ వశిష్టపైన నమ్మకం వల్లే ఈ సినిమాకి ఇంత ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం..

ఒకవేళ ఈ చిత్రానికి నాన్ థియేటర్ హక్కులు 150 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్టు అవుతుందని చిరంజీవి అభిమానులు తెలుపుతున్నారు. ఈ సినిమాలకు గ్రాఫిక్స్ పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి, వశిష్ట ఈ సినిమాతో చాలా రిస్క్ చేస్తున్నారని పరువులు భిన్నభిప్రాయాలు చేస్తున్నారు.. గత సినిమా కథలతో పోలిస్తే చిరంజీవి ఈమధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చిరంజీవి రెమ్యూనరేషన్ 30 కోట్ల రేంజ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో చిరంజీవి మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.