మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కాలంలో అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అందుకున్న చిరంజీవి సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత ముహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ప్లాప్ కావడంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారు. కూతురు సుస్మిత బ్యానర్లో చేయాల్సిన సినిమా హోల్డ్ లో పెట్టి సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో మూవీని ఓకే చేశాడు. ఈ ప్రాజెక్ట్ గురించి చిరంజీవి ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడాడు.
ఇది బ్రో డాడీ రీమేక్ అని సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ రీమేక్ సినిమాలు చేయొద్దు అంటూ మొత్తుకోవడంతో చిరంజీవి కళ్యాణ్ కృష్ణకు కూడా హ్యాండ్ ఇచ్చాడు. తమిళ్ డైరెక్టర్ మిత్రులతో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్. మెగా 157గా ప్రకటించిన వశిష్ట మూవీ 156 గా మారింది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి గ్రాండ్ లాంచ్ చేశారు. ఈ చిత్ర ప్రముఖుల కార్యక్రమానికి హాజరయ్యారు. సోషియా ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు కాన్సెప్ట్ పోస్టర్ పంచభూతాలైన గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశంలో రూపొందించారు.
ఇక ఈ సినిమాకు క్యాస్టింగ్ కూడా భారీగా ఉండనుందట. ఇక ఈ సినిమాకి సంభంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిలో యంగ్ హీరో రానా.. చిరంజీవికి విలన్ గా నటించబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. బాహుబలి సినిమాతో నెగిటివ్ రోల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా.. పాన్ ఇండియా లెవెల్లో ప్రయోజనం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిరంజీవి విలన్‌గా రానా అంటే ఈ కాంబో ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.