లేడి బ్రూస్‌లీలా ద‌ర్శ‌న‌మిచ్చిన‌ సమంత.. పిక్స్ వైరల్..

హీరోయిన్ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం పైన అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇక సమంత పర్సనల్ విషయానికి వస్తే మొదటి నాగచైతన్యతో విడాకులు తర్వాత మయోసైటిస్ బారిన పడటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వ్యాధి కొద్దిగా కోలుకున్న తర్వాత యశోద శకుంతలం ఖుషి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఖుషి సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్న సమంతకు మెడికేష‌న్ కోసం అమెరిక‌ వెళ్లి అక్కడ వెకేషన్‌లు, ట్రిప్పులు కూడా ఎంజాయ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఓవైపు మెడికేషన్ చేస్తూనే.. మరోవైపు ఫిట్నెస్ పై శ్రద్ధ చూపిస్తున్న సమంత రోజు జిమ్లో వర్కౌట్లు చేస్తూ తన శక్తిని మరింత పెంచుకుంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకొంటూనే ఉంది. అలా తాజాగా సమంత జీంలో వర్కౌట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలు సమంత చూడడానికి పర్ఫెక్ట్ బాడీతో లేడీ బ్రూస్లీ లా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమంతకి సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక‌ సెటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత అందులోని కొన్ని యాక్షన్స్ సన్నివేశాల కోసం తన బాడీని ఈ రేంజ్ లో మార్చుకుంద‌ట‌.