ఆ స్టార్ హీరో కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి..!!

తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అదే రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్గా లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ సినిమాతో అర్జున్ కు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభించాయి.. హీరో అర్జున్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంగతి కూడా తెలిసింది..

ఇందులో మొదటి కుమార్తె ఐశ్వర్య ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది ఇప్పటివరకు ఈమెకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. అందంతోపాటు ఆకట్టుకొనే అభినయం ఉన్నప్పటికీ కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అందుకే అర్జున్ ఆయన కూతురు బాధ్యతలను తన భుజాన వేసుకున్నప్పటికీ తమిళంలో ఈమెన హీరోయిన్గా పెట్టి ఒక సినిమా చేశారు.. అది కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తరువాత టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో హీరో పెట్టి ఐశ్వర్యాన్ని హీరోయిన్గా తెలుగులో చాలా గ్రాండ్ గా పరిచయం చేయాలనుకున్నారు.

ఈ సినిమా ఓపెనింగ్స్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టడం జరిగింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. కెరియర్ పరంగా ఐశ్వర్య కెరియర్ దెబ్బ తినడంతో తన కూతురికి పెళ్లి చేసి సెటిల్ చేయాలనుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. తమిళ హీరో ఉమాపతి తో ఈమె గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కోలీవుడ్ లెజెండ్ తంబి రామయ్య కి మనవడు అవుతారట ఈ నటుడు. గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం.ఆటు అర్జున్ కుటుంబం ఇటు ఉమాపతి కుటుంబం కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీలైనంత త్వరగా వివాహం చేయాలని చూస్తున్నారట.