అలా జరుగుంటే ఉదయ్ కిరణ్ చచ్చిపోయుండే వాడు కాదేమో..స్టేజీ పైనే ఏడ్చేసిన సుధ(వీడియో)..!

ఉదయ్ కిరణ్ .. ఈ పేరు చెప్తే జనాల కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి . ప్రజెంట్ మన మధ్య లేకపోయినా సరే ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ తన అభిమానుల మనుసుల్లో గుర్తుండిపోయే స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు . సినిమా ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా ఫెడవుట్ అయిపోయాడు . అంతేకాదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు . ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తూనే ఉంటుంది .

ఫైనాన్షియల్ ఇబ్బందులు కారణంగా ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా ఆయన మరణం పై ఎంత మంది బాధపడ్డా కానీ టాలీవుడ్ సీనియర్ నటి సుధా మాట్లాడిన మాటలు బాధపడిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంటాయి. రీసెంట్గా ఆమె ఈవెంట్లో పాల్గొనింది దసరా నవరాత్రుల సందర్భంగా ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే స్పెషల్ గెస్ట్ గా హాజరైంది.

ఈ క్రమంలోనే ఆమె ఉదయ్ కిరణ్ ఫోటో చేత్తో పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది . ఉదయ్ కిరణ్ నటించిన పలు సినిమాలలో ఆమె ఆయనకు తల్లి పాత్ర పోషించింది. ఈ విధంగా వారిద్దరూ చాలా దగ్గర అయిపోయారు. అంతేకాదు ఉదయ్ కిరణ్ నే తన సొంత కొడుకులాగే చూసుకుంది నటి సుధ . ఈ షోలో ఆయన మరణాన్ని తలుచుకుంటూ “ఒకవేళ వాడు నా కడుపున పుట్టుంటే ఇంకా బ్రతికి ఉండేవాడేమో” అంటూ కన్నీరుగా విలపించారు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో జరిగిన కుట్రలు కుతంత్రాల వల్లే ఉదయ్ కిరణ్ బలైపోయాడు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!