టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నిరంతరం ఈ మధ్యకాలంలో వార్తలలో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూనే ఉంది.ఇటీవల ఈమె మీడియాలో తన నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం గెలుచుకోవడం జరిగింది. ఈమె నటించిన గణపత్ చిత్రం కూడా ఈ శుక్రవారం విడుదల కావడం జరిగింది ఇక ఈమెకు ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఈమె పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. తాజాగా కృతి సనన్ ముంబైలో ఒక కొత్త అపార్ట్మెంట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు తాజాగా ఒక సంచలన విషయం బయటపడడం జరిగింది. అదేమిటంటే కృతి తన సరికొత్త ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఈమె ఇంకా ధ్రువీకరించలేదు కానీ ఇటీవల ఒక కొత్త అపార్ట్మెంట్ లో కనిపించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా వారు తెలుపుతున్న నివేదికల ప్రకారం కృతి సనన్ 4-BHK అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం దీని విలువ దాదాపుగా 32 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ అపార్ట్మెంట్లో ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా ఇదే భవనంలో నివసిస్తున్నట్లు సమాచారం. గణపత్ సినిమాలో ఈమె తోపాటు టైగర్ ష్రాఫ్, అమితా బచ్చన్ కూడా నటించారు. అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ వికాస్ బ్లహు దర్శకత్వం వహించారు. కృతి ప్రస్తుతం పలు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.