టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రీసెంట్గా నటించిన సినిమా ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటన,, విజయ్ డైలాగ్స్ చాలా చాలా జనాలకు నచ్చేశాయి . వీళ్లిద్దరి మధ్య రోమాన్స్ అయితే ఏ విధంగా పండిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకోవడంతో భారీ కలెక్షన్స్ రాబడుతుంది .
అయితే సినిమా రిలీజ్ అయ్యే వారం రోజులు ముందే అమెరికా వెళ్ళిన సమంత రీసెంట్గా హైదరాబాద్కు తిరిగివచ్చింది . మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమంత రీసెంట్గా తిరిగి ఇండియాకు వచ్చేసింది . అయితే ఆమె ఎందుకు ఇండియాకు వచ్చేసింది .. ఇంత సడన్గా అనేది ఇప్పటికీ స్పష్టత లేదు . అయితే ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఇండియా చేరుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు సమంత ఇండియా కి రాగానే ఫస్ట్ విజయ్ దేవరకొండ ని మీట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
ఖుషి సినిమా ఇంత పెద్ద హిట్ సక్సెస్ అవ్వడానికి కారణం సమంత ఎంత కారణమో.. విజయ్ దేవరకొండ కూడా అంతే కారణమని .. ఫోన్లో విషెస్ చెప్పిన సమంత డైరెక్ట్ గా ఆయనను మీటై ఖుషి సినిమా హిట్ అయినందుకు స్పెషల్ విషెస్ అందించిందట . అంతేకాదు శివ నిర్వాణ ని కూడా స్పెషల్ గా కలిసి థాంక్స్ చెప్పిందట. అయితే ఖుషి సినిమా తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ సమంత కాంబోలో ఈ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది . వీళ్ళ ఊపు చూస్తుంటే త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా చెప్పేటట్లు ఉన్నారు అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్..!!