నోటి దుర్వాసనకు చెక్ పెట్టే సింపుల్ టిప్స్ ఇవే..!

నోటి దుర్వాసన. ఈ సమస్యతో కొంత‌మంది ఇబ్బంది పడుతుఉంటారు. నలుగురు కలిసి ఓ చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.పుష్కలంగా నీరు తాగాలి. మంచినీరు నోటి లోపల క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసనను అరికడుతుంది.

2.సోంపు తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది.

3. మంచి మౌత్ ఫ్రెష్నర్‌లు.. వీటిలో పుదీనా ముఖ్యమైనది కనుక దీన్ని తీసుకోవాలి.

4. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి దుర్వాసన తగ్గిస్తుంది.

5. దాల్చిన చెక్క ముక్కలను నీటిలో వేసి మరిగించి మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించ‌వ‌చ్చు.

6. నోటి దుర్వాసన ఉంటే నోటిలో ఓ యాలుక్కాయ వేసుకుని చప్పరిస్తుంటే సరి.