విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ప‌నికి ఫుల్ ఫైర్‌లో ఉన్న శ్రీ‌లీల‌.. ఇలా హ్యాండిచ్చాడేంటి?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీలకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేర‌ర‌కొండ బిగ్ షాకిచ్చాడు. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ గా ఫిక్స్ అయిన శ్రీ‌లీల‌ను పీకిపాడేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఖుషి హిట్ తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ ఒక‌టి. `VD 12` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ సినిమా ప్రారంభం అయింది.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రాబోతున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా శ్రీ‌లీల‌ను ఎంపిక చేశారు. కానీ, ఇప్పుడు ఆమె డేట్స్ దొర‌క‌డం గ‌గ‌నం అయిపోయింది. దాదాపు ప‌ది ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా ఉన్న శ్రీ‌లీల‌.. విజ‌య్ మూవీకి చాలా రోజుల నుంచి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతుంద‌ట‌. టేమ్ వేస్ట్ అవుతుంద‌ని భావించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆమెను హీరోయిన్ గా తొల‌గించాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చెప్పార‌ట‌.

అంతేకాదు, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ను హీరోయిన్ గా సెట్ చేశాడట‌. త్వ‌ర‌లోనే విజ‌య్, ర‌ష్మిక షూటింగ్ లో జాయిన్ కానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే వీరిద్ద‌రూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి న‌టించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మ‌రోసారి వీరి కాంబో రిపీట్ అవుతుంద‌ని తెలియ‌గానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మ‌రోవైపు శ్రీ‌లీల మాత్రం విజ‌య్ చేసిన ప‌నికి ఫుల్ ఫైర్ లో ఉంద‌ట‌. ఏదేమైనా రౌడీ ఇలా హ్యాండిస్తాడ‌ని శ్రీ‌లీల అస్స‌లు ఊహించి ఉండ‌దు.