“ఉన్నది పాయే – ఉంచుకున్నది పోయే”.. ఈయన పరిస్థితి పగవాడికి కూడా వద్దు రా సామి..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో అస్సలు గెస్ చేయలేం.. మరి ముఖ్యంగా అప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో అంత నాకు నచ్చినట్లు జరుగుతుంది ..గ్రిప్ నా చేతుల్లోనే ఉంది అనుకున్న డైరెక్టర్స్ కూడా కొన్నిసార్లు బొక్క బోర్ల పడాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు అలాంటి టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ బాబి . మెగా డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బాబి చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు ప్రెసెంట్ బాలయ్య తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు బాబి .

బాబి డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా లో నటించబోతున్నాడు . రేపో మాపో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు అవ్వాలి అనుకున్న టైంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయారు . ఈ క్రమంలోనే సినిమా షూటింగ్లకు అటెండ్ అయ్యే పరిస్థితి బాలయ్యకు ఇప్పుడు లేకుండా పోయింది . అంతే కాదు బాబి పరిస్థితిని అర్థం చేసుకున్న బాలయ్య ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటాను ..వేరే వాళ్లతో తెరకెక్కించుకోండి అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారట .

అయితే ఆల్రెడీ బాలయ్య కన్నా ముందే ఓ హీరోతో బాబి సినిమాకి కమిట్ అవ్వాల్సింది. బాబి స్క్రిప్ట్ మొత్తం రాసుకొని రెడీగా ఉండగా.. బాలయ్య ఎస్ చెప్పడంతో ఆ హీరోకి ఇచ్చిన మాటను వదిలేసుకొని .. బాలయ్య కోసం ఇటువైపుగా వచ్చాడు .. ఇప్పుడు ఆ హీరో దగ్గరికి వెళ్ళినా సినిమాలు చేస్తాడని నమ్మకం లేదు.. తనతో నటించాలి తనతో వర్క్ చేయాలి అనుకున్న హీరో సినిమా వదులుకొని.. ఇటు ఈయన ఇష్టపడి అభిమానిగా ఉన్న బాలయ్య సినిమా వదులుకోవాల్సిన పరిస్థితులు రావడంతో బాబి మధ్యన నలిగిపోతున్నాడట.. ఏం చేయాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే టెన్షన్స్ లో ఉండిపోయారట..!!