టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . అయితే బన్నీ తన మరదలు శ్రీజ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందని .. అది మిస్ అయిందని దానికి కారణం ఓ స్టార్ హీరో అన్న విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది .
బన్నీ గంగోత్రి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు . ఈ సినిమా ద్వారానే శ్రీజ కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవ్వాలనుకునిందట . కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన కూతుర్ని హీరోయిన్లుగా తెరపై చూడడానికి అస్సలు ఒప్పుకోలేదట . కానీ శ్రీజ అమ్మగారు సురేఖ మాత్రం శ్రీజను హీరోయిన్గా చూడాలి అంటూ ఆశపడిందట.
శ్రీజ కి కూడా హీరో హీరోయిన్ అవ్వాలి అంటూ ఆశగా ఉండిందట. ఇదే విషయం అల్లు అరవింద్ కి చెప్పగా అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేసిన సరే చిరంజీవి అస్సలు ఒప్పుకోలేదట . అలా బన్నీ – శ్రీజ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది . అయితే ఫాన్స్ మాత్రం మంచి పని చేశారు చిరంజీవి గారు .. లేకపోతే మా బన్నీ కెరియర్ నాశనం అయిపోయి ఉండేది అంటూ కౌంటర్ మెసేజెస్ చేస్తున్నారు..!!