నేడే బిగ్ బాస్ 7 ప్రారంభం.. స్పెష‌ల్ గెస్ట్ లుగా వ‌స్తున్న టాలీవుడ్ క్రేజీ హీరోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజ‌న్‌ 7కు కూడా రంగం సిద్ధ‌మైంది. నేడే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ అవ్వ‌బోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే.. సీజ‌న్ 7ను కూడా హోస్ట్ చేయ‌బోతున్నారు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అంతా ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతోనే లేటెస్ట్ సీజ‌న్ పై ఆసక్తిని కలిగించారు. శనివారం నాడు బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో ప్రోమో ద్వారా చూపించారు. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆట మొదలుపెట్టేశారు. హౌస్‌లోకి కూడా వెళ్లిపోయారు. ఇదంతా ఈ రోజు నైట్ ప్ర‌సారం అవుతుంది. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 7కు స్పెష‌ల్ గెస్ట్ లుగా టాలీవుడ్ కి చెందిన ఇద్ద‌రు క్రేజీ హీరోలు వ‌చ్చార‌ట‌.

ఇంత‌కీ వారెవ‌రో కాదు న‌వీన్ పొలిశెట్టి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి ఆల్రెడీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బిగ్ బాస్ షో ద్వారా విజ‌య్ ఖుషిని మ‌రింత ప్ర‌మోట్ చేయ‌బోతున్నారు. మ‌రోవైపు న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంట‌గా న‌టించిన `మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి` సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే న‌వీన్ బిగ్ బాస్ వేదిక‌గా త‌మ సినిమాను మ‌రింత జ‌నాల్లోకి తీసుకెళ్ల‌బోతున్నాడు.