శ్రీను వైట్ల‌కు ఎట్ట‌కేల‌కు ఓ ప్లాప్ హీరో దొరికేశాడు… !

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీ‌ను వైట్ల కామెడీ ఓరియంటడ్ సినిమాలకు పెట్టింది పేరన్న సంగతి చాలా మందికి తెలుసు. ఇక శ్రీను వైట్ల చివరిగా 2018లో రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీ‌ను వైట్ల వరుసగా ప్లాప్‌లు ఎదురవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

అయితే తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్‌తో మరో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గ‌త కొంత కాలంగా గోపీచంద్ కూడా వ‌రుస ఫ్లాప్‌ల‌ను ఎదురుకుంటున్నాడు. ఇటీవల శ్రీ‌ను వైట్ల – గోపీచంద్‌ను కలిశాడని ఓ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్ మూవీ గోపీచంద్ తో కలిసి తీయడానికి ప్లాన్ చేస్తున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆ లైన్ హీరో గోపీచంద్ కూడా వివరించడం గోపీచంద్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో ఎట‌కేల‌కు ఫ్లాప్ డైరెక్ట‌ర్ శ్రీ‌నుకి మ‌రో ఫ్టాప్ హీరోనే దొరికాడు అంటు నెగిటీవ్ క‌మెంట్స్ చేస్తున్న‌రు నెటిజ‌న్స్.