ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఇండియా సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనుకునేవారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ద్వారా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఇండియా సినిమా అంటే మేము కూడా ఉన్నాము అని తెలియచెప్పాయి. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన కేజిఎఫ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలు సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి.
ఇదే నేపథ్యంలో బాలీవుడ్ నుంచి ఒక్క హిట్టు కూడా రాకపోవడం, బాలీవుడ్ సినిమాలు అన్ని డిజాస్టర్లు నిలవడం వాళ్ళ వారికి ప్రపంచ స్థాయిలో ఉన్న పేరుని కొంచెం తగ్గిస్తూ వచ్చాయి. మరి ఇందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ వారు బాగా ఫీల్ అయ్యారో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం సౌత్ ఇండియా పైన బాలీవుడ్ పెద్ద పన్నాగమే వేసినట్టు అర్ధం అవుతుంది. అసలు విషయానికి వస్తే మన సౌత్ డైరెక్టర్లు ఇక్కడ సూపర్ హిట్లు ఇచ్చాక బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు తీయడం ప్రారంభించారు. ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా ని బాలీవుడ్ లో ప్లాన్ చేసి అక్కడ కబీర్ సింగ్ కి సూపర్ హిట్ సినిమా అందించారు. అంతేకాకుండా గతంలోనే మన సౌత్ డైరెక్టర్ మురగదాస్ హిందీ ఆడియన్స్ కి ‘గజినీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ని ఇచ్చారు. ఇక ఇప్పుడు దర్శకుడు అట్లీ బాలీవుడ్ హీరోయిన్ షారుఖ్ ఖాన్ కి తన కెరీర్ లో మరిచిపోలేని ‘జవాన్ ‘ లాంటి సినిమా అందించారు.
ఇలా మన తెలుగు దర్శకులు హిందీ హీరోలకు మంచి మంచి బ్లాక్బస్టర్ సినిమా లను అందిస్తుంటే, హిందీ డైరెక్టర్ ఓం రాత్ మాత్రం మన టాలీవుడ్ హీరోయిన్ ప్రభాస్ కి ‘ఆది పురుష్ ‘ సినిమా ద్వారా ఘోరమైన పరాజయాని చవిచూపించాడు. ఈరకంగా మన తెలుగు హీరో ఒక హిందీ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి డిజాస్టర్ అందుకున్నారు. దీనికో సంబందించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే చాలా మంది సౌత్ సినిమా ప్రేక్షకులు మన తెలుగు దర్శకులు హిందీ వారికి ఇచ్చిన సూపర్ హిట్ సినిమాలను, అలానే ఆది పురుష్ ను కంపేర్ చేసి, బాలీవుడ్ వారు సౌత్ వారి పైన కావాలనే కక్ష తీర్చుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.