తండ్రి నుంచి అల్లు అర్జున్‌కి వచ్చిన లక్షణమిదే.. మరీ అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడా..

ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అదే పుష్ప: ది రైజ్. ఈ మూవీలో బన్నీ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చూపించాడు. తన మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూల్ లో అల్లు అర్జున్ కేక పుట్టించానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యి హైప్‌ పెంచేసాయి.

2024, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత ఈ స్టైలిష్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పుష్ప లాంటి హిట్ కొట్టిన తర్వాత కనీసం రెండు, మూడు పాన్‌ ఇండియా సినిమాలనైనా అల్లు అర్జున్ ప్రకటిస్తాడని చాలామంది ఆశించారు. కానీ అలా జరగలేదు. నిజానికి టాలీవుడ్ నుంచే కాకుండా మిగతా ఇండస్ట్రీల నుంచి కూడా డైరెక్టర్లు బన్నీ వద్దకు వచ్చి సినిమా కథలు వినిపిస్తున్నారట.

వారందరి కథలు వింటున్న అల్లు అర్జున్ ఏదో ఒక కొత్త సినిమా ప్రకటిస్తారేమోనని భావిస్తున్నా, అలా జరగడం లేదు. దానికి కారణం ఇంతకుముందు కంటే ఇప్పుడు బన్నీ చాలా మారిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి నుంచి ఒక లక్షణం అలవర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. అదేంటంటే అల్లు అర్జున్ కథ విషయంలో అసలు రాజీపడటం లేదట. అల్లు అరవింద్ కూడా కథ మంచిగా లేకపోతే అతడు టాప్ డైరెక్టర్ అయినా సినిమా రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు అదే లక్షణం అల్లు అర్జున్‌కు అబ్బిందని అంటున్నారు.

ప్రస్తుతం బన్నీకి బాగా క్రేజ్ పెరిగింది. రెమ్యూరేషన్ కూడా బాగానే పెంచేశాడు. అయితే వీటన్నిటికీ తగ్గట్లు తన నెక్స్ట్ సినిమా ఉండాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు అందుకే డైరెక్టర్ల కథలు నచ్చకపోతే నేరుగా రిజెక్ట్ చేసి పడేస్తున్నాడని సమాచారం. రాజమౌళి లాంటి డైరెక్టర్లతో తప్ప అన్ని మామూలు డైరెక్టర్లతో సినిమా ప్రకటించే అవకాశమే లేదని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా కెరీర్ గ్రాఫ్ పడుకోకుండా, అలాగే మరీ గ్యాప్ ఇవ్వకుండా అల్లు అర్జున్ నెక్స్ట్ తన సినిమాలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.