పెళ్లి కాకుండా ఒక్కే ఇంట్లో..? మరోసారి అడ్డంగా బుక్కైన విజయ్-రష్మిక..!!

తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్నిసార్లు స్టార్ ప్రముఖులు తెలిసి తెలియక తనంతో చేసిన మిస్టేక్స్ వలన సోషల్ మీడియాలో ఏకేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీలో స్టార్స్ గా మారుతున్న హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే అలాంటి తప్పులు చేస్తే సెకండ్స్ లోనే సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తారు జనాలు . మరోసారి అదేవిధంగా సోషల్ మీడియాలో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాలు. వీళ్లిద్దరి మధ్య అదేదో నడుస్తుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు వీళ్ళ ప్రేమ బ్రేకప్ అయిందని మరికొన్నిసార్లు పెళ్లి వరకు అలా పోతుందని రకరకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ట్రెండ్ అవుతూనే ఉంటాయి ..వీళ్ళని ట్రోల్ చేస్తూనే ఉంటారు .

అయితే రీసెంట్గా రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ బ్రేకప్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఖుషి సినిమాలో విజయ్ – సమంత రొమాన్స్ చూసి రష్మిక హర్ట్ అయ్యి బ్రేకప్ చెప్పిందట. అయితే అదంతా ఫేక్ అని వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని తాజాగా వాళ్ళు పోస్ట్ చేసిన ఫొటోస్ ఆధారంగా తెలుస్తుంది . రీసెంట్గా రష్మిక మందన హైదరాబాద్లో తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైంది . ఈ క్రమంలోనే ఎల్లో శారిలో చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో మెరిసింది .

ఈ ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నింది. అయితే అదే టైంలో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన పిక్స్ షేర్ చేసుకున్నారు. రెండు పిక్చర్స్ లో ఒకే లొకేషన్ ఉండడం.. అభిమానులకు షాకింగ్ అనిపించింది. అయితే కొందరు వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని పెళ్లికి ముందు సహజీవనం చేస్తున్నారని అంటుంటే.. మరికొందరు వీళ్ళు కలవడానికి కూడా మీట్ అయి ఉండొచ్చుగా ..ఎందుకు ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి విజయ్ రష్మికల మధ్య ఏదో నడుస్తుంది అన్న వార్తకు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి ఈ ఫోటోలు..!!

 

 

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)