అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ 3 సినిమాలు ఇవే!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. బ‌డా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండ‌టంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసి.. అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు.

అందులో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌గా.. మ‌రికొన్ని ప‌రాజ‌యం పాల‌య్యాయి. అయితే అల్లు అర్జున్ కెరీర్ లో మూడు సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ మూడు చిత్రాల్లో ఒక‌టి.. `సరైనోడు`. బోయాప‌టి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ 2016లో విడుద‌లైంది. అయితే మొద‌టి రోజు ఈ సినిమాకు నెగ‌టివ్ టాక్ వ‌చ్చింది. అయినా కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 120 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఘ‌న విజ‌యం సాధించింది.

అలాగే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన `సన్నాఫ్ సత్యమూర్తికి` మూవీకి మొద‌ట నెగ‌టివ్ టాకే వ‌చ్చింది. ఫ్యాన్స్ కూడా ఫ‌స్ట్ డే మూవీ చూసి ఫ్లాప్ అన్నారు. కానీ, త్రివిక్ర‌మ్ మార్క్ డైలాగ్స్, అల్లు అర్జున్ యాక్టింగ్‌, సాంగ్స్, కామెడీ సినిమాను సూప‌ర్ హిట్ గా మ‌లిచాయి. ఇక అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్‌`కు మొద‌ట ఫ్లాప్ టాకే వ‌చ్చినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విశ్వ‌రూపం చూపించింది. నెగ‌టివ్ టాక్ తోనే భారీ వ‌సూళ్ల‌ను అందుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా అల్లు అర్జున్ `పుష్ప 2` చేస్తున్నాడు.