పెళ్లియి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్న అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..!?

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లవ్ లో భారీ క్రేజ్ అందుకున్న ఈ స్టైలిష్ స్టార్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో కూడా మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు.. సాధారణ సినీ ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు కూడా అయ‌న అంటే అభిమానం.

అదేవిధంగా చిత్ర పరిషంలోకిటాలీవుడ్‌కు కొత్తగా వచ్చే యంగ్ హీరోయిన్లకు సైతంఅల్లు అర్జున్‌తో కలిసి ఒక్క సినిమాలో అయిన‌ నటించాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడు తాజాగా అలాంటి ఒక కోరికను యంగ్‌ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బయటపెట్టింది. మట్టికుస్తీ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ న‌టించిన‌ కింగ్ ఆఫ్ కోత సినిమాలో నటించింది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకు ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి అల్లు అర్జున్ అంటే తనకు ఇష్టం అంటూ సెన్సేషన్ వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా అల్లు అర్జున్‌కు పెళ్లి జ‌రిగి ఇద్ద‌రు పిల్లలు ఉన్నా కూడా తనను పెళ్లి చేసుకోవాలని ఉందని ఆ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆయనలో ఉండే స్పెషల్ టాలెంట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆయనకు అందరూ అట్రాక్ట్ అవుతారు అంటూ ఐశ్వర్య లక్ష్మి అల్లు అర్జున్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్ర‌స్తుతం ఈమె చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారాయి.