చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్న నిర్మాత .. నిజమేనా..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ఏ రేంజ్ లో టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కనీసం ఒక్కరి నోటి నుంచి కూడా ఈ సినిమా పర్వాలేదు అని అనిపించుకోలేదు. అంత చెత్తగా మెహర్ రమేష్ సినిమా తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవికి పారితోషకం పూర్తిగా చెల్లించలేదు అని, ఈ విషయంలోనే చిరంజీవికి, నిర్మాత అనిల్ సుంకర కి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే తనకు ఇవ్వాల్సిన పారిపోషకం ఇవ్వాలి అని , చిరంజీవి గట్టిగా అడిగారని అయితే వాటిని చెల్లించడానికి ఇప్పటికే సినిమా ద్వారా నష్టపోయిన నిర్మాత తన ఆస్తులను కూడా అమ్ముకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం చిరంజీవి రూ .65 కోట్ల పారితోషకంతో పాటు రూ.5 కోట్లు అదనంగా ఖర్చులు చేయించారు అని, అయితే అందులో ముందుగానే రూ.50 కోట్లు ఇచ్చేసారని, ఇక సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ అయిన తర్వాత కూడా ఇంకా మిగిలిన రూ.20 కోట్లు ఇవ్వాలని చిరంజీవి డిమాండ్ చేశారట.

 

ఈ క్రమంలోనే చిరంజీవి అడిగారని నిర్మాత తనకున్న ఆస్తులు అన్నింటిని కూడా అమ్ముకుంటున్నారని, మరొకవైపు కొన్ని ఆస్తులను తాకట్టు కూడా పెడుతున్నారు అంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మెగా అభిమానులు రూమర్లను ఖండిస్తూ ఉండగా.. నెటిజన్స్ మాత్రం చిరంజీవిని విమర్శిస్తున్నారు. దీంతో ఒక మెగా అభిమాని అనిల్ సుంకర కే మెసేజ్ పంపిస్తూ.. సార్ ఇది నిజమేనా అని అడిగారట. తాను అమెరికా వెళుతున్నానని అనిల్ రిప్లై ఇచ్చినట్లు అందులో ఉంది. మొత్తానికి అయితే దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతూ ఉండగా కొద్దిగా చూడండి అని ఆ అభిమాని మళ్లీ మెసేజ్ పెడితే అనిల్ సుంకర మాత్రం పట్టించుకోవద్దండి.. నేను మళ్ళీ చిరంజీవి గారితో మరో సినిమా చేస్తున్నాను.. ఆయన చాలా మంచివారు.. సినిమాతోనే సమాధానం చెబుదాము అంటూ అని చెప్పినట్లు సమాచారం.