బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వారా పెళ్లైనా కూడా స్కిన్ షో విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే ఇంకా ఎక్కువ అందాలు ఆరబోస్తోంది. నిత్యం గ్లామరస్ ఫోటో షూట్లతో నెటిజన్లను పట్టపగలే తగలెట్టేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో నెట్టింట పెను దుమారం రేపింది.
బ్లాక్ కలర్ డ్రెస్ లో సూపర్ హాట్ గా తయారైన కియారా.. హాట్ స్పాట్స్ ను హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. మతిపోగొట్టే అందాలతో ఒక్క క్షణం హార్ట్ బీట్ పెంచేసింది. కియారా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, లస్ట్ స్టోరీస్ తో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కియారా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలీవుడ్ లో యమా బిజీ అయిపోయింది.
స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది. తెలుగులో కూడా ఈ అమ్మడు భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తోంది. శంకర్ ఈ మూవీకి దర్శకుడు. అన్నట్లు ఈ ఏడాది ఆరంభంలో కియారా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు.
View this post on Instagram