వ‌రుస టూర్ల వెన‌క కార‌ణం అదా.. రాజ‌మౌళి మామూలోడు కాద‌య్యో!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గ‌త చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుండి క‌ల‌గా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు కూడా తెచ్చిపెట్టి అంత‌నంత ఎత్తులో కూర్చుందీ సినిమా. ఆర్ఆర్ఆర్ అనంత‌రం రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో త‌న త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ఎప్పుడో ప్ర‌క‌టించేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ తో `గుంటూరు కారం` చేస్తున్నాడు.

ఇది పూర్తైన వెంట‌నే రాజ‌మౌళి-మ‌హేష్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఇప్ప‌టికే క‌థ రెడీ అవ్వ‌గా.. స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా ఆల్మోస్ట్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని టాక్‌. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల‌ నుంచి రాజ‌మౌళి ఫ్యామిలీతో వ‌రుస టూర్లు వేస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.

ఆ తర్వాత ప్యారిస్ వెళ్లొచ్చారు. ఇప్పుడు కుటుంబంతో కలిసి నార్వే టూర్ వెళ్లారు. అయితే ఈ వ‌రుస టూర్లు అన్నీ మహేష్ బాబుతో సినిమా కోసమేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మ‌హేష్ తో చేయ‌బోయే మూవీ కోసం రాజ‌మౌళి లొకేషన్స్ ను పరిశీలిస్తున్నార‌ట‌. ఆయన వెళ్లిన ప్రతి చోట తన లేటెస్ట్ మూవీ షూటింగ్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అలాగే మ‌రోవైపు ఈ టూర్ల ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పొందుతూ ఫుల్ రిలాక్స్ అవుతున్నార‌ట‌. మొత్తానికి వ‌రుస టూర్ల‌తో ఓవైపు లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మ‌రోవైపు ప్రొఫెష‌న్ కు సంబంధించిన ప‌నులు కూడా చ‌క్క‌బెట్టుకుంటున్నాడు మ‌న జ‌క్క‌న్న‌.