ప్రముఖ మలయాళం స్టార్ హీరో, దుల్కర్ సల్మాన్ తాజాగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోనమ్ కపూర్ పై రానా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మరొకవైపు రానా మాటలకు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.. అసలు విషయంలోకి వెళ్తే దుల్కర్ తో ఒక బాలీవుడ్ హీరోయిన్ సినిమా చేసిందని , అయితే ఆమె సినిమా చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టిందని , షూటింగ్ మధ్యలో ఫోన్స్ మాట్లాడుకుంటూ హీరో సహనాన్ని పరీక్షించింది. అందుకే నిర్మాతలను కూడా నేను తిట్టాను అంటూ రానా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై స్పందించిన సోనమ్ కపూర్ తనదైన శైలిలో కామెంట్లు చేసింది. ఇక దీంతో రానా.. సోనమ్ కపూర్ కి , దుల్కర్ కి క్షమాపణలు చెబుతూ వార్తలని నెగిటివ్గా పబ్లిష్ చేశారు అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు తాను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఆమె కూడా నా స్నేహితురాలే. సోనమ్ కపూర్ కి, దుల్కర్ సల్మాన్ కి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ రానా ట్వీట్ చేశారు .
దీనిపై స్పందించిన దుల్కర్ కింగ్ ఆఫ్ కోత ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. రానా వ్యక్తిగత వ్యాఖ్యలు నేను దానిపై మాట్లాడాలని అనుకోవట్లేదు. నాకు పరిశ్రమలో మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో రానా కూడా ఒకరు. నేను ఎవరిపై కూడా కంప్లైంట్ చేయను. నా పని నేను చేసుకుంటూ పోతాను. అయితే రానా ఈ విషయాన్ని కావాలని చెప్పి ఉండరు. స్టేజ్ పైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ.. ఆయన అలా చెప్పి ఉంటారు.. అందుకే కదా తర్వాత క్షమాపణలు కూడా తెలిపారు అంటూ దుల్కర్ క్లారిటీ ఇచ్చారు.