ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-మ‌హేష్ బాబు మ‌ధ్య ఉన్న కామ‌న్ క్వాలిటీ ఏంటో తెలుసా?

టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పేర్లు ఖ‌చ్చితంగా ఉంటాయి. స్టార్ కిడ్స్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రూ స్వ‌యంకృషితోనే స్టార్డ‌మ్ ను సంపాదించుకున్నారు. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌మ అభిమానులుగా మార్చుకున్నాడు. మ‌హేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా మ‌రియు వ్యాపార‌వేత్త‌గానూ దూసుకుపోతున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌స్తే.. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు అంటూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నారు. అయితే స‌రిగ్గా గ‌మ‌నించిన‌ట్లే.. ఈ ఇద్ద‌రు స్టార్స్ మ‌ధ్య ఓ కామ‌న్ క్వాలిటీ ఉంది. అదే సింప్లిసిటీ. ఈ మాట చెప్పింది మ‌రెవ‌రో కాదు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త్రివిక్ర‌మ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ మ‌ధ్య ఉన్న కామ‌న్ క్వాలిటీ సింప్లిసిటీనే. ఎంత ఎత్తుకు ఎదిగినా ఇద్ద‌రూ చాలా సింపుల్ గా ఉంటారు. అత‌డు షూటింగ్ అప్పుడు మ‌హేష్ వార్డ్‌రోబ్ లో రెండు జ‌త‌లే బ‌ట్ట‌లు ఉండేవి. షూటింగ్ జ‌రిగేట‌ప్పుడు ఏ కాస్ట్యూమ్స్ ఇస్తే అవే వేసుకునేవాడు. ఖ‌రీదైన బ‌ట్ట‌లే కావాలి, కాస్ట్లీ వ‌స్తువులే కావాల‌ని అత‌నికి ఉండ‌దు. ఒక చిన్న రూమ్.. అందులో చూడ‌టానికి సినిమాలు, చ‌దువుకోవ‌డానికి బుక్స్ ఉంటే మ‌హేష్ కు చాలు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అంతే. స్టార్డ‌మ్ ఉంద‌న్న పొగరు చూపించ‌డు. ఖ‌రీదైన వ‌స్తువులు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కు చ‌దువుకోవ‌డానికి బుక్స్ ఉంటే చాలు.` అంటూ త్రివిక్ర‌మ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.