ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ ఫ‌స్ట్ సాంగ్ ఇంత స్పెష‌ల్‌గా ఉంటుందా…!

కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవరా. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ భయంకరమైన విలన్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా పోస్టర్ కూడా ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ ప్రమోషన్ స్టార్ట్ అయితే మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతాయని క్లారిటీ ఉంది. మూవీ ప్రమోషన్స్ కూడా కొరటాల పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్.. రాజమౌళి తన సినిమాల అప్డేట్స్‌ను ఏ విధంగా హైలెట్‌ చేస్తూ ఉంటాడో అదేవిధంగా మనం కూడా దేవర సినిమాను చేయాలి అని సజెషన్ ఇచ్చినట్లు కొరటాల దానికి ఫిక్సై అదేవిధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఎన్టీఆర్ దేవ‌ర‌కి సంబంధించిన ఫస్ట్ సాంగ్ అప్డేట్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన జైలర్ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ సినిమాకే బిగ్గెస్ట్ హైలెట్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో దేవ‌రా సినిమాలోని సాంగ్స్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

రామ్ జోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సినిమాకు సంబంధించిన కథలోని ప్రధానమైన ఆత్మను ఈ పాటలో హైలెట్ చేయబోతున్నారట. దేవరా చుట్టూ ఉండే ప్రపంచం అలాగే ఎన్టీఆర్ పాత్రను హైలెట్ చేసే లిరిక్స్ తో మొదటి సాంగ్ ఉందని తెలుస్తుంది. కొరటాల కూడా మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడట. పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్టుగా అన్ని భాషలను మెప్పించే విధంగా పాటను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ పాటతో అనిరుధ్‌ ప్రేక్షకులు అంచనాలను ఏ రేంజ్‌లో అందుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.