చీర‌క‌ట్టులో చిట్టి అందాలు ఒల‌క‌బోస్తోన్న ఈ ముద్దుగుమ్మ‌ను గుర్తు ప‌ట్టారా…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ ఫోటో షూట్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. అలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్స్ తో హడావిడి చేసే ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకటి. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ఈమె మెద‌టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినా అవకాశాలు అంతంత మాత్రం గానే రావడంతో మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల రవితేజ సినిమాలో నటించి మెప్పించింది. ఈమె సినిమాల్లో తక్కువగా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఈవెంట్‌లో పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఫరీదా అబ్దుల్లా. తన అందం, నటనతో చిట్టిగా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రవితేజ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఫరీదా చీరకట్టుతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. చీర కట్టులో అందాలు ఒల‌క‌బోస్తు ఫోటోలతో కనువిందు చేసింది. సాధారణంగా హీరోయిన్స్ చీరకట్టులో కనిపిస్తే జనం ఫిదా అవుతారు. ఇక ఫరీదా లాంటి హాట్ బ్యూటీ సడన్గా చీరకట్టులో మెరిసిందంటే కామెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రేక్షకులు ఏరేంజ్‌లో ఆమెకు ఫ్లాట్ అయిపోతారు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.