ఆయన నటించిన హీరోయిన్స్ లో బన్నీ ఫేవరేట్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బన్నీ రీసెంట్ గానే కోట్లాదిమంది అభిమానుల కోరిక తీర్చేశాడు . గత 69 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఉత్తమ జాతియ నటుడు అవార్డు తెలుగులో దక్కించుకున్నాడు . తెలుగులో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకోబోతున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాకి గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది .

కాగా ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా ఆయనకు మహానటి సావిత్రి గారు అంటే చాలా చాలా ఇష్టం అని.. గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతే కాదు తనతో నటించిన హీరోయిన్స్ లలో కాజల్ అగర్వాల్ అంటే ఆయనకు చాలా ఇష్టమట . ఆమె తో స్క్రీన్ షేర్ చేసుకుని.. టైం స్పెండ్ చేయడం బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు పరోక్షకంగా తనకు ఇష్టం లేని హీరోయిన్ అను ఇమ్మాన్యూయెల్ అంటూ గతంలోనే హింట్ ఇచ్చాడు. అయితే కేవలం అల్లు అర్జున్ కే కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా అల్లు అర్జున్ -అను ఇమ్మాన్యూయేల్ జంట నచ్చలేదు. అందుకే మరోసారి ఛాన్స్ వచ్చినా అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడు..!!