స‌మంత ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందో తెలుసా.. సినిమాలు మానేసి ఆమె చేసే ప‌ని ఇదా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత రీసెంట్ గానే రెండు ప్రాజెక్ట్ ల‌ను కంప్లీట్ చేసింది. అందులో `ఖుషి` ఒక‌టి.. మ‌రొక‌టి బాలీవుడ్ వెబ్ సిరీస్ `సిటాడెల్‌`. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. సిటాడెల్ కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ ల‌ను ఫినిష్ చేసిన స‌మంత‌.. ఒక ఏడాది పాటు సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఇందులో భాగంగా గ‌తంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల నుంచి త‌ప్పుకుంది. నిర్మాత‌లు ఇచ్చిన అడ్వాన్సులు వెన‌క్కి ఇచ్చేసింది. మ‌రికొద్ది రోజుల్లో స‌మంత అమెరికా వెళ్ల‌బోతోంది. మ‌యోసైటిస్ కార‌ణంగా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మంత‌.. మెరుగైన వైద్యం కోసం అమెరికా ప‌య‌ణం కాబోతోంది. అయితే ఇప్పుడు స‌మంత ఎక్క‌డ ఉంది.. సినిమాలు మానేసి ఆమె చేస్తుందో తెలుసా.. కోయంబత్తూరులో.

ఆధ్యాత్మిక గురువు సద్గురుకు చెందిన ఆశ్రమం ఈషా ఫౌండేషన్ లో ఉన్నారు. మానసిక ప్రశాంతత కోసం అక్క‌డ స‌మంత ధ్యానంలో మునిగితేలుతోంది. ఈషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ధ్యాన కార్యక్రమాల్లో సమంత పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో ఆలోచనల, అలజడులు ఉండవని.. మానసిక ప్రశాంత దొరుకుతుందని సమంత పేర్కొంది. దీంతో స‌మంత తాజా ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)