హిడింబ మూవీ రివ్యూ.. అశ్విన్ బాబు సక్సెస్ కొట్టాడా..!!

యాంకర్ ఓంకార్ తమ్ముడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలవుతొంది.తన కెరీర్లో రాజుగారు గది వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు అయితే ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత తను నటించిన హిడింబ చిత్రంతో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను సరికొత్త కాన్సెప్ట్ తో తీసుకురావడం జరిగింది. దీంతో అశ్విన్ బాబు కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నారేమో చూద్దాం.

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హైదరాబాదులో వరుసగా కిడ్నాప్లు జరుగుతూ ఉంటాయి ఈ కేసును ఇన్వెస్ట్ గెస్ చేసే ఇన్వెస్టర్ గా అభయ్ (అశ్విన్ బాబు) రావడం జరుగుతుంది అయితే ఈ కేసును తేల్చలేకపోతున్న నేపథ్యంలో.. కేరళలో ఇదే తరహాలో కేసును ఛేదించిన (నందితా శ్వేత ) ఆధ్య ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా బోయ అనే వ్యక్తి పైన అనుమానం పడి అతని దగ్గర ఉన్న కొంతమంది అమ్మాయిలను కాపాడుతారు. అయినప్పటికీ మిస్ అయిన అమ్మాయిలను కేవలం ఒక అమ్మాయి అక్కడ ఉందని మిగతా వాళ్ళు ఎవరో తెలియకపోవడంతో ఈ కిడ్నాప్లో వెనుక ఉన్నది ఎవరి హస్తము అనేకదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా హర్రర్ థ్రిల్లర్గా ప్రేక్షకులను మాత్రమే కాదు అన్ని భాష ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక హర్రర్ త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రేక్షకులను త్రిల్ కు గురైయేలా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఒక మైనస్ ఏమిటంటే ఫ్లాష్ బ్యాక్ సీన్లు నడుస్తూ ఉంటే ఆ తర్వాత సీన్ ప్రస్తుత కాలంలో జరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఈ సినిమాకు సెకండాఫ్ ప్లస్సుగా మారిపోయింది థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని మిస్ కాకూడదు..

ఇక అశ్విన్ బాబు గతంతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త తన నటనతో మెరుగుపరిచారు. పోలీస్ అధికారి పాత్రలో తన బాడీని బాగానే మెల్ట్ చేసుకున్నారు.. ఇక నందిత శ్వేతా కూడా తన గ్లామర్ తో పోలీస్ అధికారిగా బాగానే ఆకట్టుకుంది. ఇందులో కీలకమైన పాత్రలో నటించిన మకరంద దేశ్పాండే అద్భుతమైన నటనను ప్రదర్శించినట్లుగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

ప్లస్ పాయింట్స్:
కథ, ఎంచుకున్న క్లైమాక్స్ బిజిఎం

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, పాటలు

ఓవరాల్ గా హిడింబ చిత్రం థ్రిల్లర్ జూనియర్ ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పవచ్చు.