సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ లవ్ బర్డ్స్ ఎక్కువైపోయారు . ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు జంటలను చూస్ చేసుకున్నారు . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్‌లో తమన్నా విజయ్ వర్మల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . మనకు తెలిసిందే హీరోయిన్ తమన్నా ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి హాట్ హాట్ సీన్స్‌లో నటిస్తుంది . ఇన్నాళ్ల తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా హిట్ ఎక్కించే సన్నివేశాలను నటిస్తుంది .
రీసెంట్గా నే లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నానని డేటింగ్ చేస్తున్నానని ఓపెన్ గా చెప్పకు వచ్చిన తమన్నా అతగాడితో లసి స్టోరీస్ 2 లో ఎలా రెచ్చిపోయి బోల్డ్ రొమాన్స్ చేసిందో మనకి బాగా తెలిసిందే. అయితే రీసెంట్గా విజయ్ వర్మ బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్న పై ఉన్న ప్రేమను బయట పెట్టాడు. అంతే కాదు తమన్న ని ఎందుకు లవ్ చేశాను అనే విషయం కూడా క్లారిటీ ఇచ్చాడు.
” నేను ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించాను. చాలామంది మంచి అమ్మాయిలు నా లైఫ్ లో పరిచయమయ్యారు. అయితే వాళ్ళని చూస్తే కలగని ఫీలింగ్ తమన్నను చూడగానే కలిగింది. తమన్నా చాలా మంచి అమ్మాయి.. అందరినీ అర్థం చేసుకుంటుంది.. తన కాళ్లపై తన నిలబడాలనుకుంటుంది. ఒకరిని నొప్పించదు .. ఒకరు నొప్పిస్తే ఒప్పుకోదు తనకి ఏం కావాలో తనకి బాగా తెలుసు . మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు రాని ఫీలింగ్ నాకు తమన్నాతో ఉంటే వచ్చింది . తమన్నా నా పక్కన ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను . అప్పుడే నాకు తెలిసిందే.. నేను తమన్నాని లవ్ చేస్తున్నాను అని .. అందుకే ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకూడదని ..ప్రపోజ్ చేశాను ..యాక్సెప్ట్ చేసింది ” అంటూ బోల్డ్ గా తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ . దీంతో సోషల్ మీడియాలో విజయ్ వర్మ తమన్నా లవ్ స్టోరీ వైరల్ గా మారింది..!!