మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఒకరినొకరు లవ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి వీరిద్దరి మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే ఎప్పుడైనా నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి సందడి చేసిందో.. అప్పటి నుంచి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి.
ఫైనల్ గా అందరి అనుమానాలు నిజం చేస్తూ గత నెలలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగబాబు నివాసంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో సందడి చేశారు. నిశ్చితార్థం తర్వాత ఎలాంటి హద్దులు లేకుండా వరుణ్, లావణ్య చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి గురించి మరొకపు సోషల్ మీడియా పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా వీరికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తేదీ ఫిక్స్ అయిందట. ఆగస్టు 24న ఈ లవ్ బర్డ్స్ మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నాడు. అది కూడా ఇక్కడ కాదు.. ఇటలీలో. అవును, అక్కడ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి పెళ్లి షాంపింగ్ కూడా స్టార్ట్ చేశారట. ఇదే నిజమైతే త్వరలోనే మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ కావడం ఖాయమవుతుంది.