రీసెంట్ గా `సత్య ప్రేమ్ కీ కథ` మూవీతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. కియారా చేస్తున్న చిత్రాల్లో `గేమ్ ఛేంజర్` ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో పాటు కియారా బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్ లో భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి దర్శనమిచ్చింది. కియారా లుక్ క్యాజువల్ గానే ఉన్నా.. ఆమె తగిలించుకున్న హ్యాండ్‌బ్యాగ్ అందరినీ ఆకర్షించింది.
పింక్ కలర్ బ్యాగ్ ను కియారా భుజానికి తగిలించుకుంది. అయితే ఆ బ్యాగ్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది. ఎందుకంటే, కియారా హ్యాండ్‌బ్యాగ్ ధర అక్షరాల రూ. 4 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక బ్యాగ్ కోసం కియారా అంత ఖర్చు పెట్టిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కియారా దగ్గర ఇటువంటి మరెన్నో కాస్ట్లీ బ్యాగ్స్ ఉన్నాయి.