సుమ‌తో విడాకులు.. పిల్ల‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారంటూ రాజీవ్ కనకాల క‌న్నీళ్లు!

టాలీవుడ్ స్టార్ యాంక‌ర్ సుమ‌, విల‌క్ష‌ణ న‌టుడు రాజీవ్ క‌న‌కాల దంపతుల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్రేమించి ఆపై పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌కు ఒక కుమారుడు, కూతురు జ‌న్మించారు. పెళ్లై ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లైనా స‌రే సుమ యాంక‌రింగ్ లో నెం. 1 స్థానంలో దూసుకుపోతోంది. మ‌రోవైపు రాజీవ్ క‌న‌కాల కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నాడు.

అయితే కొన్నాళ్ల క్రితం రాజీవ్ క‌న‌కాల‌, సుమ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయి.. రాజీవ్ క‌న‌కాల మ‌రొక అమ్మాయితో రిలేష‌న్ పెట్టుకున్నాడ‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. వీటిని ఆల్రెడీ సుమ‌, రాజీవ్ క‌న‌కాల ఖండించారు. అయినా కూడా వీరిపై ఆ రూమ‌ర్లు ఆగ‌లేదు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి విడాకుల వార్త‌ల‌పై రాజీవ్ స్పందిస్తూ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

`సుమ, నేను విడాకులు తీసుకోనున్నామనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. వాటిని అనేక సార్లు ఖండించినా ఆగ‌ట్లేదు. ఎన్ని విధాలుగా తాము క‌లిసే ఉన్నామ‌ని ప్రూవ్ చేస్తున్నా న‌మ్మ‌టం లేదు. ఇలాంటి వార్త‌లు మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే చాలా బాధ ఉండేది. ఇలాంటి వార్తలను సుమ పెద్దగా పట్టించుకోదు .. కానీ, నేను అంత తేలికగా తీసుకోలేను. ఇలాంటి వార్త‌ల వ‌ల్ల‌ స్కూల్లో పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు` అంటూ రాజీవ్ క‌న‌కాల ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.