పూజా హెగ్డే పొట్ట కొట్టిన మృణాల్.. బుట్ట‌బొమ్మ‌పై ఇంత క‌క్ష క‌ట్టారేంట్రా బాబు!?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్ర‌స్తుతం డేంజ‌ర్ జోన్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ముందు వ‌ర‌కు బ్రేకుల్లేని హిట్స్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన పూజా హెగ్డేకు కొంత కాలం నుంచి ఫ్లాప్ మీద ఫ్లాప్ పడుతోంది. పూజా హెగ్డే నుంచి వ‌చ్చిన గ‌త ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఆమెను ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేయ‌డం షురూ చేశారు.

పైగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌`, మ‌హేష్ బాబు `గుంటూరు కారం` చిత్రాల్లో మొద‌ట హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. కానీ, వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల‌నో లేదా మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు గానీ.. ఈ రెండు ప్రాజెక్ట్ ల‌ను నుంచి పూజా హెగ్డేను త‌ప్పించి శ్రీ‌లీల‌ను తీసుకున్నారు. ప్ర‌స్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేక తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్న పూజా హెగ్డేకు మాస్ మ‌హారాజా ర‌వితేజ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిందంటూ టాక్ బ‌య‌టకు వ‌చ్చింది.

రవితేజ హీరోగా గోపీంచద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఇంత‌లోనే మృణాల్ ఠాకూల్ పూజా హెగ్డే పొట్ట కొట్టింది. ఆమె ద‌క్కాల్సిన అవ‌కాశాన్ని మృణాల్ ఎగ‌రేసుకుపోయింది. ముందు పూజా హెగ్డేనే హీరోయిన్ గా అనుకున్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత మృణాల్ వైపు మేక‌ర్స్ మ‌న‌సులు మ‌ళ్లింద‌ట‌. దాంతో మృణాల్ ను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. ఈ విష‌యం తెలిసి..బుట్ట‌బొమ్మ‌పై ఇంత క‌క్ష క‌ట్టారేంట్రా బాబు అంటూ ఫ్యాన్స్ త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.