డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్` ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్` ను రూపొందిస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
2024 మార్చి 8న థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ సందడి చేయనుందని ప్రారంభోత్సం రోజే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో రామ్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ మున్నా భాయ్ సంజయ్ దత్ అలరించబోతున్నాడు. అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం నాగార్జున `చంద్రలేఖ` సినిమాలో సంజయ్ దత్ గెస్ట్ రోల్ చేశారు.
మళ్లీ ఇన్నేళ్లకు `డబుల్ ఇస్మార్ట్`తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ ను కూడా బయటకు వదిలారు. సూటు బూటు వేసుకుని సంజయ్ దత్ స్టైలిష్ లుక్ లో స్మోక్ చేస్తూ సీరియస్ గా చూస్తుండగా..అతన్ని టార్గెట్ చేసినట్లు పోస్టర్ లో హైలెట్ చేశారు. సంతజ దత్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడని పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు ఆయన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, ఆయన డబుల్ ఇస్మార్ట్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు పుచ్చుకుంటున్నాడట. టాలీవుడ్ లో టైర్ 2 హీరోలు కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. కానీ, సంజయ్ మాత్రం హీరోలను మించి అనేలా ఛార్జ్ చేస్తున్నాడు.