బ్రో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బ్రో.. ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. చిత్రాన్ని డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ప్రియా వారియర్ తదితరులు సైతం నటించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది. మొదటి రోజు కలెక్షన్లు ఎంత వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Bro Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

బ్రో సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు ఏకంగా రూ .50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది .మిగతా ఆర్టిస్టులతో పోలిస్తే మొత్తంగా ఈ సినిమా రూ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 1600 స్క్రీన్ లలో రిలీజ్ అయింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు కొన్నిచోట్ల సొంతంగాన్ని రిలీజ్ చేయడం జరిగింది.. దీంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ .80 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.97 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందని రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి.

 

ఇక తొలిరోజే ఆక్యుపెన్సి విషయానికి వస్తే మార్నింగ్ షో కి 80 శాతం వరకు ఆక్యుపేసి నమోదయింది.. బ్రో మూవీ అవతార్ ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే యూఎస్ఏ లో 256 లొకేషన్స్ ఈ చిత్రం ప్రదర్శించబడింది. యూఎస్ఏ లో 550 k డాలర్లు పైగా రాబట్టగా కెనడాలో 70 వేల డాలర్లు ఉత్తర అమెరికాలో 650 k వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.15 కోట్ల రూపాయల రాగ కర్ణాటక తమిళనాడు మిగతా రాష్ట్రాలలో కలుపుకొని ఐదు కోట్లు రాగ ఓవర్సీస్ లో ఐదు కోట్లు వసూలు చేసి మొదటి రోజే రూ.35 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.