కేటీఆర్ వర్సెస్ రేవంత్..ప్రజలు ఎటువైపు.!

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత  అని చెప్పి కనీసం 12 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటుంది. ఈ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్లుకు వెళ్ళి..24 గంటలు రావడం లేదని రుజువు చేశారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, మొత్తం మీద 8 గంటలు సరిపోతాయని అన్నారు. కానీ 24 గంటల కరెంట్ ఇవ్వమని చెప్పలేదు.

కానీ రేవంత్ వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ ఫైర్ అవుతుంది. అదిగో కాంగ్రెస్ వస్తే 3 గంటలే ఇస్తుందని కామెంట్ చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని, ఇప్పుడు ఛోటా చంద్రబాబు అయిన రేవంత్ 3 గంటల కరెంట్ చాలు అని అంటున్నారని కే‌టి‌ఆర్ విమర్శిస్తున్నారు.

దీనికి రేవంత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కే‌టి‌ఆర్ అతి తెలివితో తన మాటలని వక్రీకరించి వీడియోలు పెడుతున్నారని, ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ వస్తే 24 గంటల కరెంట్ ఖచ్చితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇక తాను చంద్రబాబు మనిషిని అయితే…కే‌సి‌ఆర్ ఎక్కడ నుంచి వచ్చారని, చంద్రబాబు దగ్గర చెప్పులు మోయలేదా? అని ప్రశ్నించారు. 1999లోనే వైఎస్సార్ ఉచిత విద్యుత్ మేనిఫెస్టోలో పెట్టారని, ఆనాడు బాబు దగ్గర ఉంటూ విద్యుత్ పై తప్పుడు పాలసీలు చేసి బషీర్ బాగ్ కాల్పులకు కే‌సి‌ఆర్ కారణమయ్యారని రేవంత్ ఆరోపించారు.

దీనికి రేవంత్ కౌంటర్ ఇస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ లేదని, ఆ పార్టీని జగన్‌ మోహన్‌రెడ్డి ఎప్పుడో ఆంధ్రాకు తీసుకెళ్లాడని, ఇక్కడ చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ ఉందని చెప్పుకొచ్చారు. విద్యుత్‌ విధానంపై తప్పకుండా ప్రజల్లో చర్చపెడదామని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుని ఓట్లు అడుదామని కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన కరెంట్‌ కావాలా.. ఇప్పుడు కేసీఆర్‌ ఇస్తున్న కరెంట్‌ కావాలా అని వివరిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. మరి ప్రజలు ఎవరిని కోరుకుంటారో చూడాలి.